కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. కేంద్రం నియమించిన దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. పాకిస్థాన్ వైఖరిని విదేశాల్లో ఎండగట్టేందుకు అధికార-ప్రతిపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపించింది. ఇక కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం నియమించడంపై వివాదం చెలరేగింది.
ఇది కూడా చదవండి: Shreyas Iyer: ఫైనల్‌కు చేరిన సంతోషం పాయే.. శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్!
ఇక విదేశాల్లో భారత్ తరపున పాకిస్థాన్ వైఖరిని విదేశీ నాయకులకు వివరించారు. ఆయన మాటలను కాంగ్రెస్ తప్పుపట్టింది. తాజాగా కాంగ్రెస్ విమర్శలపై శశిథరూర్ స్పందించారు. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంలో విమర్శలు తప్పకుండా ఉంటాయని.. ఈ సమయలో వాటి గురించి ఆలోచించలేమని.. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇది కూడా చదవండి: srael: గాజా పౌరులను హమాసే హత్య చేసింది.. ఇవిగో ఆధారాలన్న ఐడీఎఫ్
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్ర దాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇక పాకిస్థాన్.. ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏడు దౌత్య బృందాలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపించింది. ఇందులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒక బృందానికి నాయకత్వం వహించారు.
న్యూయార్క్ పర్యటనలో ఉండగా శశిథరూర్ మాట్లాడుతూ.. తాను ప్రభుత్వానికి కాదు.. ప్రతిపక్ష పార్టీకి పని చేస్తున్నట్లు తెలిపారు. అయితే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ ప్రతీకార దాడులకు దిగిందని.. అదే యూపీఏ హయాంలో అలా జరగలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ నేతలకు కోపం తెప్పించింది. ఆ పార్టీ నేత పవన్ ఖేరా.. శశిథరూర్ వ్యాఖ్యలను ఖండించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగాయని గుర్తుచేశారు. చౌకబారు రాజకీయాలు చేయడానికే శశిథరూర్‌ను కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని జైరాం రమేష్ మండిపడ్డారు. ఇక మరో నాయకుడు ఉదిత్ రాజ్ స్పందిస్తూ.. శశిథరూర్‌ను బీజేపీ సూపర్ ప్రతినిధిగా నియమించాలని సూచించారు.
శశిథరూర్ నాలుగుసార్లు కాంగ్రెస్ నుంచి తిరువనంతపురం నుంచి ఎంపీగా గెలిచారు. కానీ కాంగ్రెస్‌తో సరైన సంబంధాలు లేవు. ఈ మధ్య కాలంలో బీజేపీతో కలిసి మెలిసి ఉంటున్నారు. ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. కేరళ ఎన్నికల ముందు శశిథరూర్ బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే ఊహాగానాలను తోసిపుచ్చారు.
#WATCH | Brasilia, Brazil: When asked about criticism and questions raised by Congress, Congress MP Shashi Tharoor says, "I think this is a time now for us to focus on our mission. Undoubtedly, in a thriving democracy, there are bound to be comments and criticisms, but I think at… pic.twitter.com/24bKFJ3dM5
— ANI (@ANI) June 1, 2025