Spider Web: స్పైడర్ వెబ్‌పై రష్యా వ్యూహాత్మక మౌనం.. ఏం జరగబోతుంది?
- ఉక్రెయిన్ స్పైడర్ వెబ్‌పై రష్యా మౌనం
- వ్యూహాత్మక మౌనంపై రష్యా సరికొత్త ప్రణాళికలు
- కౌంటర్ ఎటాక్‌కు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు భీకరదాడులు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌లో చాలా ప్రాంతాలు ధ్వంసం అయ్యాయి. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యాపై డ్రోన్లు, క్షిపణి ప్రయోగాలు చేసింది. ఇలా రెండు దేశాల మధ్య 4 సంవత్సరాల నుంచి యుద్ధం నడుస్తోంది. అయితే ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా చర్చలు కూడా జరిపింది. ఇక స్వయంగా ట్రంప్-పుతిన్‌కు ఫోన్ చేసి కూడా మాట్లాడారు. అయినా కూడా చర్చలు సఫలీకృతం కాలేదు. తాజాగా ఇస్తాంబుల్ వేదికగా మరోసారి చర్చలకు సిద్ధపడుతున్న తరుణంలో ఉక్రెయిన్ ఊహించని రీతిలో రష్యా వైమానిక స్థావరాలపై డ్రోన్ దాడి చేసింది. దీంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొప్ప విజయం సాధించామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆపరేషన్‌కు స్పైడర్ వెబ్‌గా నామకరణం చేశారు.
ఇది కూడా చదవండి: Government Jobs: జూన్ నెలాఖరులోపు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు అప్లై చేసుకోండి..
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
అయితే ఉక్రెయిన్ దాడి చేసి దాదాపు 48 గంటలు అవుతున్నా ఇప్పటివరకు రష్యా అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. పుతిన్ కూడా ఎక్కడా స్పందించలేదు. అయితే దీని వెనుక వ్యూహాత్మక ప్రణాళిక ఏదో ఉందని నిపుణులు భావిస్తు్న్నారు. అందుకే ప్రస్తుతం రష్యన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. కౌంటర్ ఎటాక్ చేసేందుకు రష్యా ప్రణాళికలు రచిస్తోందని తెలుస్తోంది. ఏం జరగబోతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఖలిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలు..
సోమవారం ఇస్తాంబుల్ వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఉన్నాయి. అయితే ఒకరోజు ముందు ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ పేరుతో రహస్య ఆపరేషన్ చేపట్టి.. డ్రోన్లతో రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేసింది. దీంతో రష్యన్ యుద్ధ విమానాలకు భారీ నష్టం జరిగినట్టు కనిపిస్తోంది. సెమీ ట్రైలర్ ట్రక్కుల్లో ఉక్రెయిన్ 117 డ్రోన్లు తరలించింది. రష్యన్ భూభాగంలోకి వెళ్లాక.. పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్లు రిమోట్ కంట్రోల్ ద్వారా రష్యా వ్యూహాత్మక బాంబర్లను ఢీకొట్టాయి. దీంతో పదుల కొద్దీ బాంబర్లు పేలిపోయాయి.
ఉక్రెయిన్ భద్రతా సేవ ఎస్‌బీయూ ప్రకారం.. కొన్ని గంటల వ్యవధిలోనే 40కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీని విలువ దాదాపు 7 బిలియన్లు ఉంటాయని అంచనా. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఉక్రెయిన్ ఈ ప్రణాళిక వేసింది. ఈ ఆపరేషన్ రష్యన్ భద్రతా సేవ అయిన ఎఫ్ఎస్‌బీ కార్యాలయం పక్కనే ఉన్న కార్యాలయం నుంచే నిర్వహించబడిందని, రష్యాలో అది ఎక్కడ ఉందో జెలెన్‌స్కీ వివరించలేదు. రహస్యంగా ట్రక్కులు తరలించినట్లుగా పేర్కొన్నారు. ఎయిర్‌ఫీల్డ్‌లకు దగ్గరగా ట్రక్కులు వెళ్లినట్లుగా చెప్పారు. ఇక ఈ ఆపరేషన్‌ను జెలెన్‌స్కీ స్వయంగా పర్యవేక్షించడం విశేషం.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!