హనీమూన్ జంట రాజా, సోనమ్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి దాదాపు 18 రోజుల సస్పెన్స్‌కు తెరపడింది. మేఘాలయలో హత్యకు గురైన రాజా కేసులో హంతకురాలు భార్యనేనని పోలీసులు తేల్చారు. సోనమ్‌ను సజీవంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మేఘాలయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు నలుగురు కిరాయి హంతకులను కూడా అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu BJP: అమిత్ షా”సైలెంట్ ఆపరేషన్”తో 2026లో డీఎంకే పాలన అంతం..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. బాడీని చూసి హత్యగా పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. సోనమ్ సహా నలుగురు హంతకులను యూపీలో అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Israel: పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను అడ్డుకున్న ఐడీఎఫ్
మేఘాలయ డీజీపీ ఐ నోంగ్‌రాంగ్ మాట్లాడుతూ.. మేఘాలయలోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసులో భార్యతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాజాను భార్య సోనమ్‌నే చంపించినట్లుగా చెప్పారు. ఆమె.. కిరాయి హంతకులతో హత్య చేయించిందని వెల్లడించారు. అయితే హత్య వెనుక ఉద్దేశాన్ని మాత్రం డీజీపీ వెల్లడించలేదు.
రాజా హత్య కేసులో మేఘాలయ పోలీసులు 7 రోజుల్లోనే పెద్ద విజయాన్ని సాధించారని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. హంతకులు కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వారని తెలిపారు. సోనమ్ సహా హంతకులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.
భర్త రాజాను చంపించేందుకే హనీమూన్ పేరుతో భార్య సోనమ్ మేఘాలయకు తీసుకెళ్లినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మేఘాలయ వెళ్లింది హనీమూన్ కోసం కాదని.. కేవలం హత్య చేయించడానికే తీసుకెళ్లిందని పేర్కొన్నారు. హంతకులు కూడా మధ్యప్రదేశ్‌కు చెందిన వారని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. హంతక ముఠాను మేఘాలయ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.