దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం జరిగింది. లులు మాల్ మేనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. అనంతరం హోటల్‌కి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం 9.4 గంటల ప్రాంతంలో ప్రకంపనలు జరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.4గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మన దేశంలో మామిడి పండ్లు చాలా చౌకగా దొరుకుతుంటాయి. అందరూ ఇష్టపడి తినే పండు ఇదే. ఇక మన దేశంలో ఉండే రకరకాలైన మామిడి పండ్లు ఎక్కడా దొరకవు. వేసవి కాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్‌లో ఇదొక అద్భుతమైన తీపికరమైన పండు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల ఆకస్మిక వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో అందరికీ తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. అమాంతంగా వరదలు సంభవించడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో కొందరు ప్రాణాలు కాపాడుకోగా.. ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటి వరకు 87 మంది చనిపోగా.. అనేక మంది గాయాలపాలయ్యారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ (CA) దగ్గర 18 నెలల్లో ఏకంగా రూ.3 కోట్లు గుంజుకున్నారు. నిందితులు అంతటితో ఆగకుండా నిత్యం వేధిస్తుండగా తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. యమునా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టాలని రేఖా గుప్తా కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఢిల్లీకి ప్రమాదం పొంచి ఉందని.. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.