ప్రధాని మోడీ ఇటీవల ఐదు దేశాల పర్యటనకు వెళ్లొచ్చారు. ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించి వచ్చారు. మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు.
గాజాపై ఇంకా యుద్ధం ముగియలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా స్పీకర్‌తో సమావేశం తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విలేకరులతో మాట్లాడారు. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యా్న్ని ఇజ్రాయెల్ పూర్తి చేస్తుందని తెలిపారు.
మలేషియాలో అణు భద్రతా విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. విన్యాసాలు చేస్తుండగా జోహోర్ నదిలో మలేషియా పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అధికారులను రక్షించారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశాలను కూడా శత్రు దేశాలుగా మార్చుకుంటున్నారు. ఆయా దేశాలపై భారీగా సుంకాలు విధించి తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రకటన చేశారు. డీకే. శివకుమార్‌కు 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మీడియాతో చెప్పారు.
కెనడాలో రెండు శిక్షణా విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మృతుల్లో కేరళకు చెందిన విద్యార్థి పైలట్ శ్రీహరి సుకేష్(21) కాగా.. అతని క్లాస్మేట్ కెనడియన్ పౌరుడు సవన్నామే రోయెస్(20)గా గుర్తించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడే విధంగా వ్యవహారిస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది.
అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు.
కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు.