మన దేశంలో మామిడి పండ్లు చాలా చౌకగా దొరుకుతుంటాయి. అందరూ ఇష్టపడి తినే పండు ఇదే. ఇక మన దేశంలో ఉండే రకరకాలైన మామిడి పండ్లు ఎక్కడా దొరకవు. వేసవి కాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్‌లో ఇదొక అద్భుతమైన తీపికరమైన పండు. దీన్ని తినని వారుండరు. అంత ఇష్టంగా మ్యాంగో ఫ్రూట్‌ను తింటారు. అలాంటి మ్యాంగో పండ్లను కొందరు దొంగతనంగా తీసుకెళ్లి ఆరగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Yash Dayal : ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై లైంగిక ఆరోపణలు.. ఘజియాబాద్‌లో FIR
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో అనేక రకాలైన మ్యాంగోలను ప్రదర్శనగా ఉంచారు. అందరూ చూసేందుకు ప్రదర్శనగా పెడితే.. అదే అదునుగా సందర్శన కోసం వచ్చిన సందర్శకులంతా ఎవరికి దొరికిన పండ్లను వాళ్లు బ్యాగుల్లో వేసుకుని వెళ్లిపోయారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా దొరికినకాడికల్లా మామిడి పండ్లను దోచుకున్నారు.
ఇది కూడా చదవండి: Pat Cummins Reaction : కొత్త టీమిండియాను చూస్తే భయమేస్తోంది
ప్రతి ఏటా తియ్యటి పండుగగా లక్నోలో రాష్ట్ర ప్రభుత్వం మామిడి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. జూలై 4 నుంచి 6 వరకు నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు ప్రారంభించారు. యూపీలో పండించే అనేక రకాల మామిడి పండ్లను ప్రదర్శనకు ఉంచారు. ఇక చివరి రోజున సాయంత్రం గడియారం టిక్ టిక్ అని కొట్టడంతో ఒక్కసారిగా జనం అదుపు తప్పారు. సందర్శన కోసం వచ్చిన వారంతా స్టాళ్ల మీద పడి మామిడి పండ్లను లాక్కుని ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో నిర్వాహకులు కూడా ఏం చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Last day of Mango festival in Lucknow.
This is our civic sense. No wonder, other countries don't want Indians on their land. pic.twitter.com/iFFjM7RGvp
— Tarun Gautam (@TARUNspeakss) July 7, 2025
लखनऊ
आम महोत्सव के समापन के बाद फैली अराजकता
प्रदर्शनी में लगे आमों की मची लूट
आम महोत्सव में घूमने आई आम पब्लिक ने मचाई गदर pic.twitter.com/vvabOWgTOZ— Dixit Soni (@DixitGujarat) July 7, 2025
लखनऊ में आम महोत्सव में मची आम की लूट pic.twitter.com/3baapRIWwy
— Gaurav Shukla (@shuklaagaurav) July 6, 2025