New Year Celebration Ideas: నూతన సంవత్సరం దగ్గరలోనే ఉంది. ఇప్పటికే కొత్త సంవత్సరం వేడుకలకు ప్రజలందరూ సన్నాహాలు స్టార్ట్ చేశారు. కొందరు టూర్లకు ప్లాన్ చేస్తుంటే, మరికొందరు స్నేహితులతో పార్టీకి ప్రణాళికలు వేసుకుంటున్నారు. అలాగే పలు కారణాల వల్ల బయటకు వెళ్లడానికి లేదా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారు చాలా మంది ఉన్నారు. ఈ కొత్త ఏడాది సంబరాలకు మీకు ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమీ లేకపోతే ఎలాంటి నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీలో మీ న్యూ ఇయర్‌ను చిరస్మరణీయంగా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.
READ ALSO: Boxing Day tsunami: 23,000 అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో, అదే 2004 సునామీ..
వాస్తవానికి ప్రతీ ఒక్కరికి అత్యంత విశ్రాంతినిచ్చే వాతావరణం వారి ఇల్లే. ఈ సందర్భంగా పలువురు విశ్లేషకులు మాట్లాడుతూ.. ప్రియమైన వారితో గడిపే సమయం నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఉత్తమ మార్గంగా చెబుతున్నారు. మీ టైంను కొంచెం కేటాయించి, దానికి కొంచెం సృజనాత్మకత, సానుకూల దృక్పథాన్ని యాడ్ చేస్తే, మీ ఇంటిని సెలబ్రేషన్స్ ప్లేస్‌గా మార్చుకోవచ్చని తెలిపారు.
* నిజానికి నూతన సంవత్సరం అనేది అందరికీ ఒక పాజిటివ్ పవర్‌తో ప్రారంభం కావాలి. మీ ఇంటిని లైట్లు, దీపాలు, కొవ్వొత్తులు లేదా చిన్న అలంకరణ వస్తువులతో అలంకరించడం ద్వారా మీరు మీ ఇంట్లో వేడుక వాతావరణాన్ని సృష్టించవచ్చు.
* దీంతో మీరు మీ కుటుంబంతో ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. అలాగే ఈ వేడుకలలో మీరు ఒక మంచి విందును ప్లాన్ చేసుకోండి. అందులో ఇంట్లో వారికి నచ్చిన కొన్ని ప్రత్యేక వంటకాలను భాగం చేయండి. అలాగే మీకు కావాలంటే కొన్ని బయటి నుంచి కూడా ఆర్డర్ చేసుకోండి. తర్వాత ఒక అందమైన టేబుల్‌ను సెట్ చేయండి, అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి తేలికపాటి సంగీతం వింటూ కలిసి విందు ఆరగించండి. నిజానికి ఈ వాతావరణం కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. అలాగే కుటుంబం అంతా కలిసి సమయం గడపడానికి అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తుందని తెలిపారు.
* మీరు మీ కుటుంబంతో లేదా మీ లైఫ్ పార్టనర్‌తో కలిసి ఈ న్యూ ఇయర్ రాత్రిని సరికొత్తగా ఒక సినిమాతో ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని స్నాక్స్ సిద్ధం చేసుకుని, అందరూ కలిసి ఇంట్లో సినిమా చూడటం అనేది ఒక ప్రత్యేకమైన ఆనందం ఇస్తుంది.
* మీ స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను ఈ నూతన సంవత్సర వేడుకలకు మీ ఇంటికి ఆహ్వానించి చిన్న పార్టీ లాంటిది నిర్వహించవచ్చు. ఈ పార్టీలో సంగీతం, నృత్యం, స్నాక్స్ ఏర్పాటు చేయండి. అలాగే పార్టీలో వినోదాత్మక వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడటానికి కొన్ని ఆటలను చేర్చండి. అందరూ కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం మీ న్యూ ఇయర్‌ను చిరస్మరణీయంగా మలుస్తుంది.
* ఒక వేళ మీరు ఒంటరి ఉన్నా కూడా మీ నూతన సంవత్సరాన్ని ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కు మీకు ఇష్టమైన వంటకాన్ని వండుకుని, సినిమా, వెబ్ సిరీస్ లేదా పుస్తకం చదువుతూ ఎంజాయ్ చేయండి. దీంతో పాటు డైరీ రాయడం, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడం వంటివి చేయవచ్చు.
READ ALSO: Personal Finance Tips: సంపాదన ఉన్నా ఆదాయం మిగలట్లేదా? అయితే జాగ్రత్త !