దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. 32 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ (CA) దగ్గర 18 నెలల్లో ఏకంగా రూ.3 కోట్లు గుంజుకున్నారు. నిందితులు అంతటితో ఆగకుండా నిత్యం వేధిస్తుండగా తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. తన మరణానికి గల కారణాలు వివరిస్తూ తన తల్లికి సూసైడ్ లేఖ రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Nidhhi Agerwal : ‘పాపా.. మీ మమ్మి నంబర్ ఇవ్వు’.. నిధి అగర్వాల్‌కు నెటిజన్ షాకింగ్ కామెంట్!
ముంబైలోని శాంటాక్రూజ్‌లోని యశ్వంత్ నగర్‌కు చెందిన రాజ్ మోర్ (32). చార్టర్డ్ అకౌంటెంట్. రాజ్ మోర్‌కు చెందిన ఒక ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. అడినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన రాజ్ మోర్ 18 నెలల్లో రూ.3 కోట్లు పంపించాడు. అయినా కూడా బెదిరింపులు ఆగకపోవడంతో రాజ్ మోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రాజ్ మోర్ తన తల్లికి సూసైడ్ లేఖ రాశాడు. తన ఆత్మహత్యకు రాహుల్ పర్వానీ, సబా ఖురేషినే కారణమని పేర్కొ్న్నాడు.
3 పేజీల సూసైడ్ నోట్!
‘‘నా ప్రియమైన అమ్మా క్షమించండి. నేను మీ మంచి కొడుకుని కాలేకపోయాను. మీరు నా నుండి చాలా ఆశించారు కానీ నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తున్నాను. నా పనుల కోసం నేను వెళ్తున్నాను. దేవుడు మీ తదుపరి జన్మలో నాలాంటి కొడుకును మీకు ఇవ్వకూడదు. నేను చాలా చెడ్డవాడిని. పూనమ్ ఆంటీ దయచేసి నా తల్లిని జాగ్రత్తగా చూసుకోండి. నాకు వివిధ ఖాతాల్లో పాలసీలు ఉన్నాయి. ఆ డబ్బు తీసుకొని నా తల్లికి ఇవ్వండి. క్షమించండి” అని లేఖలో రాశారు.
ఇద్దరు బ్లాక్ మెయిల్..
‘‘నెలల తరబడి తనను రాహుల్ పర్వానీ, సబా ఖురేషి బ్లాక్ మెయిల్ చేశారని.. పొదుపు డబ్బు, కంపెనీ ఖాతా నుంచి కూడా డబ్బులు దొంగిలించారని తెలిపారు. దీపా లఖానీ ఈరోజు క్షమాపణ చెప్పడానికి మాటలు రావడం లేదు. మీ నమ్మకాన్ని వంచించాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఖాతాను తారుమారు చేసి మీకు పంపాను. శ్వేత, జయప్రకాష్‌లకు ఏమీ జరుగుతుందో తెలియదు. దయచేసి వారిపై ఎటువంటి చర్య తీసుకోకండి.’’ అని రాజ్ మోర్ సూసైడ్ నోట్‌లో వివరించాడు.
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజ్ మోర్ స్టాక్ మార్కెట్‌లో భారీ పెట్టుబడులు పెట్టాడని.. సీఏగా అధిక జీతం ఉందని నిందితులకు తెలుసు అన్నారు. ఆ కారణంతోనే ప్రైవేటు వీడియోను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడి రూ.3కోట్లు లాక్కున్నారని చెప్పారు కంపెనీ ఖాతా, వ్యక్తిగత ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాజ్ మోర్ నుంచి బలవంతంగా లగ్జరీ కారును కూడా తీసుకున్నారని వెల్లడించారు. BNS సెక్షన్ 308(3), 308(2), 3(5), 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం పేర్కొన్నారు. తన కుమారుడు అనేక నెలలుగా మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నాడని రాజ్ తల్లి పోలీసులకు చెప్పింది.
ఇది కూడా చదవండి: Bhairavam : తెలుగు, హిందీ భాషల్లో ‘భైరవం’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడు ఎక్కడంటే.?