ఉక్రెయిన్ ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణ చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేర్పులు.. మార్పులకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ రాజీనామా చేశారు. మంగళవారం ష్మిహాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే అమెరికా మద్దతుతో రష్యాపై భారీ దాడులకు ఉక్రెయిన్ సిద్ధపడుతోంది. ఇందులో భాగంగానే జెలెన్‌స్కీ ఈ మార్పులు.. చేర్పులకు పూనుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: RaviTeja : రీల్ ఫాదర్ ను.. రియల్ ఫాదర్ ను ఒకేసారి కోల్పోయిన రవితేజ
ఇక నూతన ప్రధానిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఉప ప్రధాని అయిన యులియా స్వైరిడెంకోను జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. యులియా.. జెలెన్‌స్కీకి సన్నిహితురాలు. అంతేకాకుండా సుదీర్ఘకాలం నుంచి మంచి మిత్రురాలు కూడా. అంతేకాకుండా అమెరికా, ఉక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చల్లో యులియా కీలకపాత్ర పోషించింది. అలాగే పశ్చిమ దేశాల మిత్రులతో జరిగిన పలు ఉన్నతస్థాయి చర్చల్లోనూ ఈమె చురుగ్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి యులియాను సెలెక్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: BIG NEWS : అనిల్ హత్యలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం
ఇక ష్మిహాల్ 2020, మార్చి నుంచి ప్రధాని పదవిలో ఉన్నారు. ష్మిహాల్ రక్షణ మంత్రిగా నియమితులయ్యే అవకాశం ఉందని జెలెన్‌స్కీ సోమవారం తెలిపారు. ఇక ఈ వారంలో యులియా నామినేషన్‌పై పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది. ఇక రాబోయే ఆరు నెలలకు సంబంధించిన ప్రణాళికలను గురించి ఇప్పటికే యులియాతో చర్చించినట్లు జెలెన్‌స్కీ తెలిపారు.
