భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం జైశంకర్ సోమవారం చైనాకు వెళ్లారు. జూన్ 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు సర్దుకున్నాయి. ఇక పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఎస్ జైశంకర్ సమావేశం అయ్యారు. ఇక చైనాతో ఘర్షణ తర్వాత జైశంకర్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోరం.. ప్రేమికుడి కోసం కన్నకూతుర్ని చంపేసిన ఇల్లాలు
ఇదిలా ఉంటే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా మూడు చెడు ఉద్దేశాలను గుర్తుచేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఈ మూడు తరుచుగా కలిసి జరుగుతాయన్నారు. ఏప్రిల్ 22న భారత్‌లో పహల్గామ్ ఉగ్ర దాడిని ప్రపంచమంతా చూసిందని గుర్తుచేశారు. జమ్మూకాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని, మత విభజన కోసం ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలి ఈ దాడిని తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిపారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని.. దీనికి ప్రతీకారంగా లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ (HM) వంటి ఇతర ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, రష్యన్ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌లను కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: King Charles: బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిసిన టీమిండియా..!