అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంతో పాటు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం.. టేకాప్ అయిన కొన్ని సెకన్లకే కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న 241 మందితో పాటు హాస్టల్‌లో ఉన్న మెడికోలు కలిసి 271 మంది చనిపోయారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: Handri Neeva: హంద్రీనీవా ఫేజ్-1 విస్తరణ పనులు పూర్తి.. ఎల్లుండి నీటిని విడుదల చేయనున్న సీఎం..
అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులను నిలిపేసింది. చెకప్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విమాన సర్వీసులను ఆగస్టు 1 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఈ మేరకు ఎయిరిండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక పూర్తి సర్వీసులు మాత్రం అక్టోబర్ 1, 2025 నుంచి పునరుద్ధరించబోతున్నట్లు పేర్కొంది. ‘‘జూలైతో పోలిస్తే ఆగస్టు 1 నుంచి కొన్ని ఫ్రీక్వెన్సీల పునరుద్ధరణ పాక్షిక పునఃప్రారంభం అవుతుందని.. 2025 అక్టోబర్ 1 నుంచి పూర్తి పునరుద్ధరణ జరుగుతుంది’’. అని ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: UP: పోలీసుల కర్కశత్వం.. ప్యాంట్‌పై సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్‌లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.