తమిళనాడులో ఇటీవల పోలీసుల దెబ్బలు తాళలేక సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి.. పోలీసులను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అదే తరహాలో యూపీలో కూడా ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదారు. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి: Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో రిలీజ్..
ఫరూఖాబాద్‌లోని ఛేడా నాగ్లా ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. తన భర్త దిలీప్ రాజ్‌పుత్ తాగి వచ్చి తనను కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిలీప్‌ను పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలిచారు. దిలీప్ తన తండ్రితో కలిసి స్టేషన్‌కు వచ్చాడు. అయితే కేసు రాజీ చేయడానికి రూ.50,000 ఇవ్వాలంటూ కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్ కోరాడు. అందుకు దిలీప్ నిరాకరించాడు. దీంతో కానిస్టేబుల్ యశ్వంత్.. దిలీప్‌పై దాడి చేశాడు. అనంతరం మరో కానిస్టేబుల్ మహేష్ ఉపాధ్యాయ్ జోక్యం చేసుకుని రూ.40,000కు బేరం కుదిర్చాడు. అనంతరం దిలీప్‌ను విడిచిపెట్టేశారు.
ఇది కూడా చదవండి: AP High Court: ప్రసన్నకుమార్‌రెడ్డిపై హైకోర్టు సీరియస్.. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా..?
అయితే ఈ ఘటనపై దిలీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకున్న దిలీప్.. వేసుకున్న ప్యాంట్‌పై భార్య తండ్రి వాన్వారీ లాలా, ఆమె సోదరుడు రాజు, అతని బావమరిది రజనేష్ రాజ్‌పుత్, ఇద్దరు కానిస్టేబుల్ వేధించి కొట్టారని.. పోలీసులు లంచం కూడా డిమాండ్ చేశారని సూసైడ్ నోట్ రాసి గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రూ.40,000 చెల్లించాకే పోలీసులు విడిచిపెట్టారని పేర్కొన్నాడు. కుమారుడు మరణంపై దిలీప్ తండ్రి పోలీసులకు ఫిర్యాద చేశాడు. దిలీప్ భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టారని ఫిర్యాదు చేశాడు.
భార్యాభర్తల కొట్లాటపై సోమవారం ఫిర్యాదు అందిందని పోలీసు సూపరింటెండెంట్ ఆర్తి సింగ్ తెలిపారు. రాజీ కుదిర్చేందుకు సహాయం చేశామని.. కానీ దిలీప్ ఇంటికి చేరుకోగానే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఎటువంటి గాయాలు లేవని తేలిందన్నారు. బంధువులు, కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.