రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు.
జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మరణించారు.
లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
బీహార్‌లో ఏడాది చివరి కల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
భారత్‌పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ పరిణామం కచ్చితంగా చికాకు కలిగించే అంశం అని రూబియో పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుజరాత్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సబర్మతి నదీ తీరం దగ్గర ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఇందకు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ స్పందించి ప్రశంసలు కురిపించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ లిస్ట్‌పై తీవ్ర రగడ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏడాది బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రధాని మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. రక్షా బంధన్‌కు ముందు దేశ వ్యాప్తంగా రైతులకు బహుమతి అందించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు.