లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఇండియా కూటమి నేతలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఆగస్టు 7న విపక్ష సభ్యులకు డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
వైపీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయలో విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న దూషించిన కేసులో అనిల్‌కు నోటీసులు ఇచ్చారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం కలిగింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సోరెన్ శిబు తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మోసం కేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముక్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. ముక్తార్ అన్సారీ ఈ సంవత్సరం గుండెపోటుతో మరణించాడు.