జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుజరాత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా సబర్మతి నదీ తీరం దగ్గర ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఇందకు సంబంధించిన ఫొటోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ స్పందించి ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: Home Minister Vangalapudi Anitha: వైఎస్ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూకాశ్మీ్ర్‌లో పర్యాటక రంగం దెబ్బతింది. దీంతో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దు్ల్లా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుజరాత్‌లో ఒమర్ అబ్దుల్లా రెండు రోజుల పర్యటన చేపట్టారు. జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగం గురించి వివరించారు. భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమైన భాగం అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తోటి భారతీయులు జమ్మూకాశ్మీర్‌ను సందర్శించాలని కోరుతున్నట్లు వేడుకున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఘటనను మరిచిపోయి.. తిరిగి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక గుజరాత్ పర్యటన ఫొటోలను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. శెభాష్ అంటూ ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: Mumbai: రోజుకు 30 నిమిషాల పని.. నెలకు రూ18 వేల జీతం.. ముంబై కుక్ సంపాదన తెలిస్తే షాకే!
కాశ్మీర్ నుంచి కెవాడియా వరకు ఒమర్ అబ్దుల్లా సబర్మతి నదీ తీరాన్ని ఆస్వాదించడం, ఐక్యతా విగ్రహాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని మోడీ పేర్కొ్న్నారు. ముఖ్యమంత్రి పర్యటన తోటి భారతీయులను దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రేరేపిస్తుందని మోడీ బదులు ఇచ్చారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్ పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతింది. అనేక మంది ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా దేశ పర్యటన చేపట్టి.. జమ్మూకాశ్మీర్‌కు వస్తే భద్రతా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుజరాత్‌లో పర్యటించారు. పర్యటన సందర్భంగా టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఇండస్ట్రీ వాటాదారులతో సమావేశమయ్యారు. దేశీయ పర్యాటకులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Kashmir to Kevadia!
Good to see Shri Omar Abdullah Ji enjoying his run at the Sabarmati Riverfront and visiting the Statue of Unity. His visit to SoU gives an important message of unity and will inspire our fellow Indians to travel to different parts of India. @OmarAbdullah https://t.co/MPFL3Us4ak pic.twitter.com/bLfjhC3024
— Narendra Modi (@narendramodi) July 31, 2025