జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రియాసి కొండచరియలు విరిగిపడి జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్యకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రాజిందర్ సింగ్ రాణా తన సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర విషాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kalabhavan Navas: మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!
రాజిందర్ సింగ్ రాణా.. రియాసి జిల్లాలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. రాజిందర్ సింగ్ రాణా తన కుటుంబంతో కలిసి ధర్మరి నుంచి తన స్వస్థలమైన పట్టియాన్‌కు వెళుతుండగా సలుఖ్ ఇఖ్తర్ నల్లా ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియల భాగంలో ఒక పెద్ద బండరాయి వాహనంపై పడింది. దీంతో కారులో ఉన్న రాజిందర్ సింగ్ రాణా, ఆయన కుమారుడు సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: గుడ్‌న్యూస్.. ఇవాళే వారి ఖాతాల్లో సొమ్ము జమ..
రాణా.. 2011 బ్యాచ్ అధికారి. రామ్‌నగర్ ఎస్‌డీఎంగా నియమితులయ్యారు. ఇక ప్రమాదంలో చనిపోయిన అధికారి కుటుంబానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు. ఒక అత్యుత్తమ అధికారిని కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటల్ డల్లూ కూడా విచారం వ్యక్తం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ వారం ప్రారంభంలో తూర్పు లడఖ్‌లో ఆర్మీ వాహనంపై కూడా బండరాయి పడి ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు.
ఇది కూడా చదవండి: Ben Stokes: స్కూల్ టీచర్‌తో 7 ఏళ్లు డేటింగ్.. బెన్ స్టోక్స్ పెద్ద ఆటగాడే!
Chief Minister has expressed profound grief over the tragic death of SDM Ramnagar, Rajinder Singh Rana and his son in a landslide at Thuroo, Reasi.
Terming it an irreparable loss, the Chief Minister offered his heartfelt condolences to the bereaved family and prayed for peace…
— Office of Chief Minister, J&K (@CM_JnK) August 2, 2025