ఉత్తరప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై తీవ్ర దుమారం చెలరేగింది. అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి.
హిమాచల్‌ప్రదేశ్‌ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరుసగా ఈ మధ్య రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. తాజాగా కులు జిల్లాలోని మలానా-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో కాఫర్‌డ్యామ్ దగ్గర ఆకస్మిక వరదలు సంభవించాయి.
దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచో పార్టీ ఆలోచన చేస్తోంది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.
బంగారం ప్రియులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధరలు.. శనివారం అమాంతంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు.. ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా మళ్లీ ధరలు కొండెక్కుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.
రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.