ఇజ్రాయెల్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో గాజాపై మరింత పోరాటానికి ఇజ్రాయెల్ సిద్ధపడినట్లైంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం సమావేశం అవుతున్నట్లు మాస్కో డిప్యూటీ ఐక్యరాజ్యసమితి రాయబారి డిమిత్రి పాలియాన్స్కీ తెలిపారు.
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టారిఫ్‌ల విషయంలో ఇరు దేశాల మధ్య సఖ్యత చెడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ శుక్రవారం హై-లెవల్ సమావేశానికి సిద్ధమయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.
ఎన్నికల సంఘం తీరుపై మరోసారి కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానం కలుగుతుందన్నారు.
హసన్ మాజీ ఎంపీ, జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. పని మనిషిపై అత్యాచారం కేసులో గతేడాది ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు.
భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఆగస్టు 27 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. కొత్త టారిఫ్ కారణంగా పలు రంగాలు ఘోరంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిగా వస్త్రాలు, ఆటో రంగం, సముద్ర ఫుడ్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.
భారత్‌పై కక్ష కట్టినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. భారత్ మంచి స్నేహితుడు అంటూనే సుంకాల పేరుతో వాయించేస్తున్నారు. తొలుత 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు.