దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం తేదీ ఫిక్స్ అయింది. ఈనెల 15న అలాస్కాలో పుతిన్‌ను కలుస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది తానేనంటూ పదే పదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు. దీన్ని భారతప్రభుత్వం పలుమార్లు ఖండించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికి రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎలక్షన్ కమిషన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీ-ఎన్నికల కమిషన్ ఓట్ల కుట్రకు పాల్పడుతున్నారని గురువారం ఇండియా కూటమి సమావేశంలో ఆరోపించారు.
గాజాను స్వాధీనం చేసుకోవాలన్న తీర్మానానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హమాస్‌ను అంతం చేసి గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమికి ఇచ్చిన విందులో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ-ఎన్నికల సంఘం ఓట్ల కుట్ర చేసిందని తీవ్రంగా ఆరోపించారు.
దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులు సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కోట్లాది రూపాయలు పోగొట్టుకుని లబోదిబో అంటున్నారు.
భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల వరకు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత 25 శాతం టారిఫ్ పెంచగా.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ట్రంప్ పెంచారు. దీంతో పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.