జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 మంది సిబ్బందితో వెళ్తున్న బస్సు లోయలోకి పడిపోయింది. దీంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ వేసింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలో రెండో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం ప్రత్యక్షంగా కలవబోతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బిజు జనతాదళ్ (బీజేడీ) మాజీ ఎంపీ పినాకి మిశ్రా మే 30న వివాహం జరిగింది. జర్మనీలోని ఒక ప్రైవేటు వేడుకలో ఇద్దరూ ఒక్కటయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాలో విమాన సేవలు నిలిచిపోయాయి. టెక్నాలజీ సమస్య కారణంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షణతో విసుగు చెందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య తీవ్ర వివాదాస్పదమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మోనార్క్‌లా ప్రవర్తిస్తు్న్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ దూరం అయ్యారు. అదే కోవలో పలువురు ఉన్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధంలో మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు.