పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థి-ఎనిమిదో తరగతి విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. దీంతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. స్కూల్ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీ. సమయం బుధవారం ఉదయం. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి అంటూ పెద్ద ఎత్తున కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన నివాసంలోనే ముఖ్యమంత్రిపై దాడి జరగడం తీవ్ర సంచలన సృష్టించింది. ఇక ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, గడ్కరీ హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసిన నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజేష్‌భాయ్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందినవాడిగా వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం తన నివాసంలో ఒక యువకుడు రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో రేఖా గుప్తా సహా అధికారులు షాక్ గురయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వారంలో మరోసారి స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీలోని మాలవీయ నగర్, కరోల్ బాగ్ లోని రెండు పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
పార్లమెంట్ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి. నేరం చేస్తే ప్రధానమంత్రైనా, ముఖ్యమంత్రైనా తొలగించే ప్రతిపాదిత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన ఆరోపణలపై అరెస్టైన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పాలి. లేకుంటే ఈసారి ఆటోమేటిక్‌గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది.