ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసిన నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. నిందితుడు రాజేష్‌భాయ్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందినవాడిగా వెల్లడించారు. ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన కొద్దిసేపటికే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లుగా ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ
బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జనసభ జరుగుతుండగా రేఖా గుప్తాపై తొలుత వినతిపత్రం సమర్పించాడు. అనంతరం యువకుడు గట్టిగా అరిచాడు. అంతలోనే ఆమె చెంపపై కొట్టాడు. వెనువెంటనే దుర్భాషలాడాడు. ఇలా ముఖ్యమంత్రితో యువకుడు తీవ్ర ఘర్షణకు దిగాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడం పెద్ద భద్రతా లోపంగా కనిపిస్తోంది. రేఖా గుప్తాకు గాయాలు కావడంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం దగ్గర భారీగా భద్రత పెంచారు. ఒక యువకుడు అంత దగ్గరగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వెళ్లాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
అయితే నిందితుడి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా ఆ పార్టీ అధికారి ప్రతినిధి ప్రవీణ్ శంకర్ చెెప్పుకొచ్చారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కాషాయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.