బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాజాను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గాజా స్వాధీనాని ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గాజాపై ఆపరేషన్‌కు ముందు మరో 60,000 మంది రిజర్విస్టులను సైన్యంలోకి పలిచింది. దీంతో రిజర్విస్టుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంటుంది.
ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
కేరళలో మలయాళ నటి రిని ఆన్ జార్జ్.. ఓ యువ రాజకీయ నాయకుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని.. అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్ట్‌లో ఎక్కడా కూడా యువ నాయకుడి పేరు ప్రస్తావించలేదు.
కర్ణాటకలో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని ఒక వివాహితుడు స్నేహితురాలిని సరస్సులోకి తోసేసి చంపేశాడు. ఈ సంఘటన బుధవారం హసన్ జిల్లాలోని చందనహళ్లి ప్రాంతంలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. సోమవారం నుంచి వరుసగా ఢిల్లీ స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లో అదృశ్యమైన న్యాయవాది అర్చన తివారీ నేపాల్ సరిహద్దులో ప్రత్యక్షమైంది. ఆగస్టు 7న ఇండోర్ నుంచి కాట్నీకి వెళ్తుండగా అదృశ్యమైంది. దీంతో పేరెంట్స్ భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీరియస్‌గా తీసుకున్న కేసును.. మూడు బృందాలు వేటాడాయి
తాజ్ మహల్.. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. దీన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 17వ శతాబ్దపు నాటి వారసత్వ సంపదను అధికారులు భద్రంగా కాపాడుతున్నారు. ఇక తాజ్ మహల్‌ను బయట నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.
తెలిసీతెలియని వయసులో యువతీయువకులు ఏం చేస్తుంటారో వారికే అర్థం కాదు. వ్యామోహాన్నే ప్రేమ అనుకుని దారి తప్పుతుంటారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక అమ్మాయి కోసం 100 కి.మీ ప్రయాణం చేశాడు.