Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
- ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం
- రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు
- నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం తన నివాసంలో రేఖా గుప్తాను ఒక యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. ఈ హఠాత్పరిణామంతో రేఖా గుప్తా సహా అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టి, జుట్టు లాగడంతో ఆసుపత్రి పాలయ్యారని బీజేపీ నాయకులు తెలిపారు. 30 ఏళ్ల వయసున్న యువకుడు ‘జనసభ’ సందర్భంగా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడి చేసిన యువకుడిని పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
ముఖ్యమంత్రి నివాసంలో జనసభ జరుగుతుండగా రేఖా గుప్తాపై తొలుత యువకుడు గట్టిగా అరిచాడు. అనంతరం ఆమె చెంపపై కొట్టాడు. అనంతరం దుర్భాషలాడాడు. ముఖ్యమంత్రితో యువకుడు తీవ్ర ఘర్షణకు దిగాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడం పెద్ద భద్రతా లోపంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం దగ్గర భారీగా భద్రతా పెంచారు. ఒక యువకుడు అంత దగ్గరగా ముఖ్యమంత్రి దగ్గరకు ఎలా వెళ్లాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. భద్రతా సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు తొలుత ఒక పత్రాన్ని సమర్పించాడు. వెంటనే ఆమెపై అరవడం ప్రారంభించాడు. ఇంతలోనే చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడాడు. అయితే అతడి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా ఆ పార్టీ అధికారి ప్రతినిధి ప్రవీణ్ శంకర్ వ్యాఖ్యానించారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కాషాయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!