దేశ రాజధాని ఢిల్లీ. సమయం బుధవారం ఉదయం. ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి అంటూ పెద్ద ఎత్తున కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన నివాసంలోనే ముఖ్యమంత్రిపై దాడి జరగడం తీవ్ర సంచలన సృష్టించింది. ఇక ఘాతుకానికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్‌భాయ్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: MP: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి వ్యామోహం.. దూరం పెట్టడంతో ఎంత పని చేశాడంటే..!
ఇక దాడి తర్వాత సకారియా కుటుంబ సభ్యులను మీడియా ప్రతినిధులు కలిశారు. సకారియా తల్లి భాను మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు కుక్కలను ప్రేమిస్తాడని.. ఢిల్లీలోని కుక్కలను షెల్టర్‌కు తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉంటున్నాడని చెప్పుకొచ్చింది. కోర్టు తీర్పు రాగానే తన కొడుకు ఢిల్లీకి వెళ్లిపోయాడని.. తన ఇంకేమీ తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సకారియా బంధువును అరెస్ట్ చేసిన తర్వాత సహాయం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినట్లుగా మరొక కథనం వెలువడుతుంది.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ
బుధవారం ఉదయం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో జనసభ నిర్వహిస్తున్నారు. సకారియా వినతిపత్రాలతో ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చాడు. వినతిపత్రాలు ఇస్తూనే రేఖా గుప్తాతో వాగ్వాదం పెట్టుకున్నాడు. పెద్ద పెద్దగా అరిచాడు. ఇంతలోనే దుర్భాషలాడుతూ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా రేఖా గుప్తా షాక్‌కు గురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు తాగి ఉన్నట్లు మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారిస్తున్నారు. అసలు దాడికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఢిల్లీలో 8 వారాల్లో కుక్కలను షెల్టర్‌కు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెెంటనే ఇండియా గేట్ దగ్గర ఆందోళన చేపట్టారు.