ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ పట్టుసాధిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. కా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండు నెలల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించాడు. ఇక వైట్‌హౌస్‌లో ట్రంప్ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.
దేశ వ్యాప్తంగా ఓట్ల చోరీ వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం-ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కథువాలో ఆకస్మిక వరదలు కారణంగా ఏడుగురు చనిపోయారు. జోధ్ ఘాటిలో వరదలు కారణంగా ఐదుగురు చనిపోతే.. జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులుగా ఉన్న బంగారం ధరలు గత వారం బాగానే తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ సుంకాలు కారణంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతాయని గోల్డ్ లవర్స్ ఆందోళన చెందారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్‌ను అత్యంత దారుణంగా టోల్ సిబ్బంది దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కర్రలతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం సాగింది.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.