MP: ఉపాధ్యాయురాలిపై విద్యార్థి వ్యామోహం.. దూరం పెట్టడంతో ఎంత పని చేశాడంటే..!
- ఉపాధ్యాయురాలిపై విద్యార్థి వ్యామోహం
- దూరం పెట్టడంతో పెట్రోల్ పోసి ఘాతుకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయసులో కలిగే కోర్కెలకు కళ్లెం వేసుకోకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. హైస్కూల్ వయసులోనో.. లేదంటే కాలేజీ వయసులోనో సహజంగా రకరకాలైన ఆలోచనలు పడుతుంటాయి. వాటిని అనుచుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. లేదంటే కార్యరూపం దాలిస్తే.. లోనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్.. మోడీ హాజరు
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
మధ్యప్రదేశ్‌లో సూర్యాంష్ కొచార్ అనే 18 ఏళ్ల విద్యార్థి.. ఒక ఉపాధ్యాయురాలిపై ఏకపక్షంగా వ్యామోహం పెంచుకున్నాడు. రెండేళ్ల నుంచి టీచర్‌తో విద్యార్థికి పరిచయం ఉంది. దీంతో ఆమెతో బాగా అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఆమెకు తెలియకుండానే ప్రేమిస్తున్నాడు. కానీ అది హద్దులు దాటడంతో కష్టాలు కొని తెచ్చుకున్నాడు.
ఇది కూడా చదవండి: Trump-Modi: భారత్‌పై సుంకాలు పెంచింది అందుకే.. వైట్‌హౌస్ క్లారిటీ
నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎక్సలెన్స్ స్కూల్‌లో సూర్యాంష్ కొచార్ పూర్వ విద్యార్థిగా ఉన్నాడు. అదే పాఠశాలలో 26 ఏళ్ల మహిళ గెస్ట్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే కొచార్ ఏకపక్షంగా ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమెకు మాత్రం ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గెస్ట్ టీచర్ చీర ధరించుకుని వేడుకలకు హాజరైంది. అయితే ఆమె చీరపై కొచార్ అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొచార్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచి మందలించారు. అంతే కొచార్ పగతో రగిలిపోయాడు. తనపై కంప్లంట్ చేస్తుందా? అని కోపంతో మండిపోయాడు.
సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కొచార్ పెట్రోల్ బాటిల్ తీసుకుని టీచర్ ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఎలాంటి సంభాషణ లేకుండానే పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 10-15 శాతం గాయాలతో బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తీవ్రగాయాలు ఉన్నప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.
నిందితుడు-ఉపాధ్యాయురాలు రెండు సంవత్సరాలకు పైగా ఒకరికొకరు తెలుసు అని పోలీసులు తెలిపారు. సూర్యాంశ్ ఆమె పట్ల ఏకపక్ష అనుబంధాన్ని పెంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు టీచర్ చీరపై అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయడంతో మొదలైన వివాదం.. ఈ దారుణానికి కారణమైందని సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ గుప్తా తెలిపారు. విద్యార్థిది ఏకపక్ష ప్రేమ మాత్రమే అని తెలిపారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీసులు వేగంగా చర్య తీసుకున్నట్లు చెప్పారు. కొన్ని గంటల్లోనే డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్‌పూర్ గ్రామం నుంచి నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని.. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!