జగదీప్ ధన్‌ఖర్.. మాజీ ఉపరాష్ట్రపతి. జూలై 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్రపతికి లేఖ పంపారు. అప్పటి నుంచి బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఆయన ఏమయ్యారంటూ విపక్షాలు.. కేంద్రానికి లేఖలు రాశాయి. ధన్‌ఖర్ సమాచారం ఇవ్వాలంటూ అమిత్ షాను శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కోరారు.
ఇది కూడా చదవండి: Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్‌లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!
తాజాగా జగదీప్ ధన్‌ఖర్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం ధన్‌ఖర్ ఓటీటీ షోలు, టేబుల్ టెన్నిస్, యోగా చేస్తున్నారంటూ ఓ అధికారి తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతిగా ప్రభుత్వం తగిన బంగ్లాను కేటాయించిందని చెప్పారు. అధికారికంగా కారు, ఎస్కార్ట్ కారు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ప్రయోజనాలన్నీ లభిస్తాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
జాతీయ మీడియా కథనం ప్రకారం… మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సాయంత్రం పూట టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం పూట మాత్రం యోగా సాధన చేస్తున్నారని సమాచారం. గురువు ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఓటీటీ వాచ్‌లిస్టులో ది లింకన్ లాయర్, హౌస్ ఆఫ్ కార్డ్స్ చూస్తున్నారు. వాస్తవానికి వృత్తిపరంగా ధన్‌ఖర్ న్యాయవాది కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
ఇక భార్య సుదేష్ ధన్‌ఖర్ గత నెలలో రాజస్థాన్‌కు కనీసం మూడు రోడ్ ట్రిప్‌లు చేసినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో పూర్వీకుల వ్యవసాయ భూమిలో ధన్‌ఖర్ దంపతులు రెండు వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్తె కామ్నా వాజ్‌పేయి గుర్గావ్ ప్రతిరోజూ సందర్శిస్తూ వస్తుంది. సుదేష్ ధన్‌ఖర్ చివరిసారిగా జైపూర్‌కు 7-10 రోజుల క్రితం ప్రైవేట్ సందర్శనకు వచ్చారని సమాచారం. జైపూర్ విమానాశ్రయం నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో న్యూ సంగనేర్ రోడ్‌లో ఈ నిర్మాణం ఉంది.