ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి... మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోస్తా తీరం వెంబడి అధికారులు తగిన చర్యలు చేపట్టారు .. తుఫాను తీవ్రతరం అవుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.. అయితే, కాంగ్రెస్ వేవ్‌లోనూ దాదాపు 40 స్థానాలను అధికార బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించడమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమే ప్రచారం ఉంది.
సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.
ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.
టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనం బాట పట్టనున్నారు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన ఆయన.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితం అయ్యారు.. శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా లభించింది.. ఈ మధ్య పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.. ఇక, ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆమంచి కృష్ణ మోహన్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్.. టీడీపీకి రాత్రికి రాత్రే మద్దతు తెలపడం కార్యకర్తలు, అభిమానులకు ఇబ్బంది కలిగించిందన్నారు.. ప్రధాని మోడీ నన్ను అర్థం చేసుకున్నారు అని పవన్ చెప్పడం ఆయన అభిమానులు, కార్యకర్తల్లో ఉన్న నిస్పృహ ను అర్ధం చేసుకోవచ్చు అన్నారు.
నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను అన్నారు.. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తాను అన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని వెల్లడించారు చంద్రబాబు.
ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్... కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఇక, బల్క్ ఫారమ్-7 డిలీషన్స్ చెల్లవు.. బల్క్ ఫారమ్- 7 అప్లికేషన్లు ఆన్ లైన్ లో తీసుకోవద్దని సీఈసీ ఆదేశించిందని తెలిపారు.