మీచౌంగ్ తుఫాన్ దెబ్బకి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రద్దు చేశారు.. ఇండిగో నుంచి నడిచే 14 విమానాలు రద్దు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. విశాఖ, హైదరాబాద్, బెంగులూరు, షిర్డీలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు చేసినట్టు పేర్కొంది ఇండిగో.. మరో 4 విమానాల రాకపోకలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ వినియోగం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండాలని.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు
అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది.. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసింది కేంద్రం.. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది.. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానం ఇచ్చింది.
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు.