Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై చర్చ సాగుతోంది. కుదిరిన పొత్తులపై క్లారిటీ లేకపోగా.. కొత్త పొత్తులపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడడం.. కొత్త చర్చకు దారి తీసింది.. అసలు సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన వ్యాఖ్యలతో పొత్తుల విషయం ఇంకా అస్పష్టంగానే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. పొత్తుల విషయం ఇంకా ఉందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
రాబోయే రోజుల్లో కుట్రలు జరుగుతాయి.. కుతంత్రాలు జరుగుతాయి.. కుటుంబాలను చీలుస్తారు. పొత్తులు పెట్టుకుంటారు.. అబద్ధాలు చెబుతారు. మోసాలు చేస్తారు అంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త చర్చ సాగుతోంది.. అయితే, ఏపీలో ఇప్పటికే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందనేది స్పష్టమైంది.. మరోవైపు.. బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే విషయం తెలియకపోయినా.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. అంతేకాదు ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు.. వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతోనే సీఎం వైఎస్ జగన్ ఆ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే.. ఆ పార్టీ మరింత బలపడుతోంది.. ఈ సమయంలో.. సీఎం జగన్ ప్రకటించిన ఆ కొత్త పొత్తు ఏంటి? అనే చర్చ సాగుతోంది.. కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా పోటీచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బ తగులుతుందని.. అది అధికార పార్టీకి కలిసివచ్చే అవకాశం కూడా ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, తాను ఎన్డీఏ భాగస్వామిని అని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నారు.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరినా.. బీజేపీ వ్యవహారం తేలాల్సి ఉంది.. ఈ సమయంలో.. చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తారా? సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం అదేనా? అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..