Telangana Assembly Elections 2023: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి రేపుతున్నాయి.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది.. అత్యంత ఉత్కంఠగా మారిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సంస్థలు ఒక పార్టీకే జైకొట్టినా, మరికొన్ని మాత్రం అధికార పార్టీకే వీర తిలకం దిద్దాయి. ఇంకొన్ని హంగ్ తప్పదని ఢంకా బజాయిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం కొంచెం ఇష్టం. కొంచె […]
గుండెపోటు కారణంగా గుజరాత్లో ఆరు నెలల్లో 1052 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు వారే 80 శాతం మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెబుతోంది. గుండెపోటు ఘటనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 2 లక్షల మంది టీచర్లు, కాలేజీ ప్రొఫెసర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే, జలం జగడంపై కృష్ణా రివర్ బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో టీ 20ల్లో అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.