ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్లకు తమ క్యాబ్ డ్రైవర్లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
2023 ఏడాది ముగింపు దశకు వచ్చేశాం.. నేటితో నవంబర్ ముగించుకుని.. రేపు డిసెంబర్లో అడుగుపెట్టబోతున్నాం.. ఇక, డిసెంబర్‌తో 2023కి బైబై చెప్పేసి.. 2024 ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం.. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సాధారణ సెలవులు, ఇతర సెలవులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలకు జరగగా.. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది.. ఇప్పుడు ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నట్టు కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతోంది.. గురువారం రోజు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల ఫలితాలపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయట.. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కోట్ల రూపాయలు పందెం […]
పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పలు పరిశ్రమలు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.