* విజయవాడ: నేటి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు.. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు అన్ని సాధారణ సర్వీసులు రిజర్వ్‌డ్
* ఏపీలో 26వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 12వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* ప్రకాశం : పొన్నలూరు, మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయాల్లో వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాలు, ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : పోటీకి దూరంగా ఉంటానని ప్రకటన అనంతరం కోమరోలు, రాచర్ల మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు..
* ప్రకాశం : దర్శిలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం..
* గుంటూరు : నేడు తెనాలిలో పర్యటించనున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. చినరావూరు రోడ్డులోని జనసేన కార్యాలయంలో జనసైనికులు, వీర మహిళలతో సమావేశం…
* గుంటూరు: నేడు బ్రాడీపేటలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సమస్య- భూ ప్రాధాన్యత పై రాష్ట్ర స్థాయి సదస్సు ….
* నేడు పల్నాడులో ఏ డే విత్ కలెక్టర్ పేరు తో విద్యార్థులతో ముఖాముఖి, పాల్గొననున్న జిల్లా కలెక్టర్ శివ శంకర్…
* పల్నాడు : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12 నుంచి ఐదు రోజులు పాటు ఈపూరు మండలం ముప్పాళ్ళ లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు.
* నేడు గుంటూరు గుజ్జనగుండ్ల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా …
* ఎన్టీఆర్ జిల్లా: నేటి నుంచి తిరుపతమ్మ మండల దీక్షలు ప్రారంభం.. ఈ నెల 12 వరకు దీక్షలు కార్యక్రమం.. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 4 వరకు దీక్షల విరమణ
* కాకినాడ: నేడు పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికారక బస్సు యాత్ర.. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
* నేడు ఏలూరులో బిజెపి రాష్ట్రస్థాయి వివిధ మోర్చాల సమావేశం.. పాల్గొననున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.
* పశ్చిమగోదావరి జిల్లా: తణుకు నియోజకవర్గంలో ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
* కాకినాడ: నేడు జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు సమావేశం.. ఈ నెల 10 న తుని లో జరగగనున్న చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం ఏర్పాట్లు పై చర్చించనున్న నేతలు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి… ముత్తుకూరులో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొంటారు
* నెల్లూరులోనే టిడిపి జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సమావేశం.. వెంకటగిరిలో నిర్వహించనున్న చంద్రబాబు సభ ఏర్పాట్ల పై సమీక్ష
* తూర్పుగోదావరి జిల్లా: అంతర్జాతీయ తెలుగు మహా సభలు రెండవరోజున ఉదయం క్రుతాజ్ఞతాంజలిసభ రాజమండ్రి గైట్ కాలేజీ రాజరాజనరేంద్రవేదికపై జరుగును, సాయంత్రం తెలుగుతోరణం కార్యక్రమం
* అనంతపురం : నేడు జేఎన్టీయూ(ఏ) 13 వ స్నాతకోత్సవం. ముఖ్యఅతిథిగా ఛాన్సలర్ హోదాలో హాజరు కానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. 71 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేత.
* అనంతపురం : బుక్కరాయసముద్రం మండలంలో జరిగే వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ .
* విశాఖ: నేడు ఉత్తర నియోజకర్గంలో సామాజికి సాధికార బస్సుయాత్ర.. మాధవధార నుంచి పోర్ట్ హాస్పిటల్ వరకు ర్యాలీ,బహిరంగ సభ.. పాల్గొనున్న రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, నార్త్ ఇన్ఛార్జ్ కేకేరాజు,
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో నూతన నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన. ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి, బాబయ్య స్వామిదర్గాలో చాదర్ సమర్పించనున్న మంత్రి. మార్కెట్ యార్డ్ లో నాయకులు , కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం