MLA MS Babu: ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పులపై కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.. పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం విదితమే కాగా.. ఉన్నట్టుండి ఇప్పుడు ఆయన యూ టర్న్ తీసుకున్నారు.. ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని స్పష్టం చేశారు ఎంఎస్ బాబు.. ఇంట్లో తండ్రిని కొడుకు ఏ విధంగా అడుగుతాడో అదే హక్కుతో నేను మాట్లాడాను.. వాటిని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయని మండిపడ్డారు.
Read Also: Sharad Pawar: బీజేపీ “హిట్లర్”లా పనిచేస్తోంది.. వారు గోమూత్రాన్ని మాత్రమే చూస్తారు..
ఇక, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తండ్రి లాంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, నన్ను గెలిపించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజలే కారణం అన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. నేను ప్రెస్ మీట్ లో మాట్లాడినవి ఎవరిని ఉద్దేశించి కాదన్న ఆయన.. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ కోసమే కష్ట పడతాను, మంత్రి పెద్దిరెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేలు మరువలేనిది పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చిచ్చుపెట్టే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నన్ను వైసీపీ నుంచి బయటకు పంపించాలన్న ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.
Read Also: Instagram Fraud: అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు.. న్యూడ్ ఫోటో కావాలని వేధింపులు..
కాగా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు లేదని చెప్పడంపై సీఎం వైఎస్ జగన్‌ఫై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాట్ కామెంట్లు చేసిన విషయం విదితమే.. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వైసీపీ హైకమాండ్ ఐప్యాక్ సర్వేలపై ఆధారపడుతున్నట్టు ప్రచారంలో ఉండగా.. డబ్బులిస్తే ఐప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు తారుమారు చేస్తారు అని ఆయన ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం లేదని, పూతలపట్టు టికెట్ ఆశించవద్దని చెప్పడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.. పూతలపట్టు నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడ్డాను.. కానీ, తనకు టికెట్ నిరాకరించడం సరైన నిర్ణయం కాదన్నారు.. టికెట్ల అంశంలో వైసీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది.. దళితులు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తున్నారు అంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకోవడం విశేషం.