ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా.. సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి "రా కదలి రా!" పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు..
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతదేహాలు ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేర్చారు.. ఒక్కసారిగా ఆ మృతదేహాలను చూసి బోరున విలపించారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయన్ని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఓదార్చారు..
చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. నేను చేసినా తప్పు ఎంటో జగన్ చెప్పాలి? అని నిలదీశారు. ఐదేళ్లుగా ఎప్పుడైనా వైఎస్ జగన్ ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానన్న ఆయన.. దళితులకు జగన్ ఏమి న్యాయం చేశారు..? దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా..? అంటూ మండిపడ్డారు.
వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. షర్మిల రాకతో కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమికి కూడా ప్రయోజనమేనన్న ఆయన.. వైసీపీ నుంచి బయటకు రావాలనుకునే వారికి షర్మిల ద్వారా అవకాశం దొరికినట్టే అన్నారు.. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదు.. షర్మిల రాకతోనే వెంటనే అన్నీ జరగబోవు అని వ్యాఖ్యానించారు.