Sajjala Ramakrishna Reddy: మీడియాను మేనేజ్ చేస్తే చాలని కొన్ని రాజకీయ పార్టీలు అనుకుంటాయి.. కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తున్నా.. ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. 11 మెడికల్ కాలేజీలతో స్పెషలిస్టులను తయారు చేసుకునేలా ఎదగడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ చెప్పుకోవడం లేదు.. అంతే అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు హిమాలయమంత విగ్రహం పెట్టినా సరిపోదన్న ఆయన.. విజయవాడ రాజకీయ చైతన్యం కలిగిన నగరం.. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాం అని తెలిపారు. విజయవాడలో జరిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గజిటెడ్ అధికారుల వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విజయవంతంగా అభివృద్ధికి వినియోగించామని తెలిపారు సజ్జల.. గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలు వేరే విధంగా ఉంటాయి.. అరుణ్ ని అసోసియేషన్ లో ఉండమనడంలో నా స్వార్ధం కూడా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో అసోసియేట్ అవ్వడమే వైసీపీ లక్ష్యంగా పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పథకాలు కొందరొకే వచ్చాయి.. సీఎం వైఎస్ జగన్ అర్హులను వెతికి మరీ ఇచ్చారని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్ళలో జరిగిన పనులు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరగలేదు అని చెప్పెకొచ్చారు. అంబేద్కర్ మహా విగ్రహం నిర్మించి జగన్ చిత్తశుద్ధి నిరూపించుకున్నారు.. అణగారిన వర్గాలు పైకి వచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారులు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. 80 శాతం సచివాలయ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే వచ్చాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇక, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ అసోసియేషన్ కు రికగ్నిషన్ ఇవ్వాలని కోరుతున్నా.. లయాజన్ ఆఫీసర్ పోస్టు మా అసోసియేషన్ లో ఒకరికి ఇవ్వాలి.. మా అసోసియేషన్ భవన నిర్మాణానికి స్ధలం ఇవ్వాలని కోరుతున్నా.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఒక శాశ్వతమైన రూల్ కావాలి.. ఇది ఎస్సీ, ఎస్టీ ఆత్మగౌరవ సభగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కొడుకు గా ఈ అసోసియేషన్ కు ఛీఫ్ పాట్రన్ గా ఉన్నాను.. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఆత్మగౌరవం ఉందన్నారు. అంబేద్కర్ బాటలో ఎన్నో కార్యక్రమాలు చేసారు సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించిన ఆయన.. మళ్లీ, మళ్లీ జగన్ అవసరం ఈ రాష్ట్రానికి ఉందన్నారు.