CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతిలో నిర్వహించిన ఇండియాటుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది.. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్ విధించింది.. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్వెన్స్ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.. అందుకే చంద్రబాబు 52 రోజులు జైలులో ఉన్నారని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఎన్నికల ముందు ఎవరైనా అపోజిషన్ నేతను అరెస్ట్ చేయాలని అనుకోరన్న ఆయన.. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్ అయ్యారు అన్నారు.
Read Also: CM YS Jagan: కాంగ్రెస్ ది డర్టీ గేమ్.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..
ఇక, నేను ఏమీ హామీ ఇచ్చాను, నేనే ఏం చేశాను అన్నది చూడాలి అని విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాను.. అమలు చేయడమే కాదు, వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగాను అన్నారు. ఇది మా ప్రభుత్వానికున్న విశ్వసనీయత.. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయాన్ని, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం.. వివక్ష లేకండా, అవినీతి లేకుండా అర్హత ఉన్నవారికి డీబీటీ ద్వారా పథకాలు అందించామని వెల్లడించారు. డీబీటీ అన్నది ఒక విజయవంతమైన అంశం అయితే విద్య, వైద్యం, మహిళా సాధికారితల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చామని పేర్కొన్నారు.. అన్నిటికంటే మించి వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేశాం.. కచ్చితం మేం తిరిగి అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఏవీ కూడా పథకాలు గురించి మాట్లాడవు, వాటి అమలు గురించీ మాట్లాడలేవు.. ఇదే బడ్జెట్ గతంలోనూ ఉంది.. ఇప్పుడూ ఉంది.. కానీ, మార్పు ఏంటంటే.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారారు.. కానీ ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందన్నారు సీఎం వైఎస్ జగన్.