ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఎన్నికల్లో కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్న ఆయన.. ఏపీలో వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు.