Swami Paripoornananda: ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు స్వామి పరిపూర్ణానంద.. శ్రీ సత్యసాయిలోని హిందూపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి.. విస్తృతంగా పర్యటిస్తున్నారు.. హిందూపురం లోక్‌సభతో పాటు హిందూపురం అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేస్తాను అంటున్నారు. ఈ నెల 21వ తేదీన హిందూపూర్ అసెంబ్లీకి, 25వ తేదీన పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. హిందూపూర్‌లో ఉన్న మైనారిటీలు స్వామీజీకి అభ్యర్థిగా కేటాయిస్తే ఓటు వేయ బోరన్న ఒక కారణంతోనే నాకు సీటు కేటాయించలేదని కొంతమంది అంటున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నా.. అయితే, కేంద్ర పెద్దల నుండి హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై స్పష్టమైన హామీ వస్తే నా నామినేషన్ ఉపసంహరణపై ఆలోచిస్తాను అన్నారు. ఇక, గత 75 సంవత్సరాలుగా హిందూపురం పార్లమెంట్ అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. మరోవైపు.. నేను పొత్తు ధర్మాన్ని విస్మరించలేదు, టికెట్ కేటాయించిన సమయంలో కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా గడ్డి పరికను విసిరేసిన విధంగా ప్రవర్తించారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు స్వామి పరిపూర్ణానంద.
Read Also: Pottel Teaser : రా & రస్టిక్ కంటెంట్ తో ‘పొట్టేల్’.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్!