ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ-20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్ కోహ్లీ.. టీ-20 ఫార్మాట్లో ఇంత వరకూ 376 మ్యాచ్లు ఆడాడు కోహ్లీ.. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.