CM YS Jagan Stone Attack Case: విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.. అయితే, సీఎం జగన్ పై దాడి కేసులో నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. సతీష్ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలను పేర్కొన్నారు పోలీసులు.. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న LW 8, LW9 సమాచారంతో సీఎం జగన్ పై దాడి చేసిన నిందితుడిని గుర్తించాం.. కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా నిందితుడి కదలికలు స్పాట్ లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశాం.. 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి మొబైల్ ఫోన్ సీజ్ చేశామని వెల్లడించారు.. నిందితుడు కేసులో A2 ప్రోద్బలంతో కుట్ర చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించాం.. వైఎస్ జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Election: యూపీ ఎన్నికల్లో తెలంగాణ మహిళ పోటీ.. ఏ పార్టీ నుంచంటే..!
ఇక, దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలని ఉద్దేశ్యం ఉందని నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.. సీఎం జగన్ ను అంతం చేయాలని సున్నితమైన తల భాగంలో దాడి చేశారు.. రాత్రి 8 గంటల 4 నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి నిందితుడు చేరారు.. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి తీసుకొని వచ్చాడు. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని హత్యా చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు పోలీసులు.