పోతిన మహేష్ ఇప్పుడు ఏ చేయి నరుకుంటావు? అని ప్రశ్నించారు కిరణ్ రాయల్.. కొబ్బారికాయల కత్తి నీకు మా కార్యకర్తలు కొరియర్ చేస్తారని పేర్కొన్నారు. జనసేన వల్ల నువ్వు నాయకుడు అయ్యావు ఆ విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలని సూచించారు. ఎంత తీసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురద చల్లావో అందరికి తెలుసు అని దుయ్యబట్టారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. ఇటీవలే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు..