CM YS Jagan: నేడు 3 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన.. హిందూపురంలో ప్రసంగంపై ఆసక్తి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న ఆయన.. ఈ రోజు కూడా మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.. ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: Tribal Women : గిరిజన మహిళలకు అండగా సీఆర్‌పీఎఫ్
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
అయితే, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో సభ నిర్వహించనున్నారు.. రెండు వేల మందితో భారీ పోలీసు బందోబస్సు ఏర్పాటు చేస్తున్నారు.. అయితే, ఈ సారి హిందూపురంలో జెండా ఎగురవేస్తామంటున్నాయి వైసీపీ శ్రేణులు. కానీ, హాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో నటసింహం, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పనిచేస్తున్నారు.. అయితే, బాలకృష్ణ నియోజకవర్గం కావడంతో సీఎం వైఎస్ జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!