AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. శుక్రవారం వరకు డీబీటీ ద్వారా పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం.. అయితే, గత నెల సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు తమ ఖాతాల్లో పడిన సొమ్ము తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూలు కడుతున్నారు.. బ్యాంకులు ఓపెన్ చేయకముందే.. ఉదయం 9 గంటల నుంచే వాటి ముందు క్యూలు కడుతున్నారు.. అయితే, డీబీటీ ద్వారా డబ్బులు జమ కానివారికి ఇవాళ్టి నుంచి ఇంటి దగ్గరే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..
Read Also: Hardeep Singh Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ఒకర్ని అరెస్ట్ చేసిన కెనడా పోలీసులు
Also Read
పెన్షన్ల పంపిణీ కొరకు ఈ నెల 1,945.39 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏపీలో పెన్షనర్ల సంఖ్య 65,49,864గా ఉందని.. మూడు రోజుల్లో 64,13,200 మందికి అంటే 97.91 శాతం లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. మరోవైపు.. మొత్తం 16,57,361 మందిలో 15,95,482 (96.27 శాతం) మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించింది ఏపీ ప్రభుత్వం.. 48,92,503 మందిలో 48,17,718 (98.47 శాతం) మందికి డీబీటీ ద్వారా పెన్షన్లు అందించినట్టు పేర్కొంది.. 74,399 మంది బ్యాంకు ఖాతాలు పని చేయకపోవడంతో పెన్షన్ అందలేదని స్పష్టం చేసింది.. పెన్షన్ అందని 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.. ఈ రోజు, రేపు 74,399 మందికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజావార్తలు
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?