Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్ కామెంట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada vs Daughter: తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్ కామెంట్స్ చేశారు.. తాజాగా, ముద్రగడ వ్యవహార శైలి, సవాళ్లపై స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు ఆయన కూతరు క్రాంతి.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. దీంతో.. తన కూతురు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.. నా కూతురుకు పెళ్లి అయ్యింది.. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ.. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు. నన్ను నా కూతురుతో కొంతమందితో తిట్టించారని మండిపడ్డారు.. ఇది బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను.. ఇక పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్న సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మరోవైపు.. నేను పదవుల కోసం పాకులాడను అని స్పష్టం చేశారు ముద్రగడ.. ఏ పదవులు కూడా అడగనన్న ఆయన.. నేను సేవకున్ని మాత్రమే అన్నారు. నా కూతురి వ్యాఖ్యలకు బాధపడిన భయపడను.. నా కూతురు.. ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని పేర్కొన్నారు.. ఇక, నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు.. ఎవరు బెదిరించినా.. బెదిరిపోను జగన్ కి సేవకుడిగా ఉంటాను.. నా కూతురికి, నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారు.. బెదిరిపోను అని స్పష్టం చేశారు ముద్రగడ పద్మనాభం..
Read Also: Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న అషు రెడ్డి..
కాగా, ముద్రగడ పద్మనాభంకు షాక్ ఇస్తూ.. ఆయన కూతురు క్రాంతి ఓ వీడియో చేయడం చర్చగా మారింది.. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదన్న ఆమె.. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇక, వీడియోలో క్రాంతి ఏం మాట్లాడిందనే విషయాల్లోకి వెళ్తే.. అందరికీ నమస్కారం.. నేను క్రాంతి. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గారిని ఓడించేందుకు వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా మా నాన్న ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్ ను ఓడించి… పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే.. నా పేరును ముద్రగడ పద్మనాభంరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.. కానీ, ఈ కాన్సెప్ట్ ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదన్నారు.. అంతే కాదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానుకు కూడా నచ్చలేదన్నారు క్రాంతి.. వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపుకోసం కష్టపడొచ్చు. కానీ, పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదని హితవుపలికారు.. ఇక, కేవలం పవన్‌ని తిట్టడానికే మా నాన్నని.. వైఎస్ జగన్ వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్నను ఎటూ కాకుండా వదిలేయడం పక్కా.. అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి.
ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు.
కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు..#PawanKalyanWinningPithapuram… pic.twitter.com/6qqrND4d97
— JanaSena Party (@JanaSenaParty) May 3, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!