Bandi Sanjay: 4 స్ధానాల నుంచి 8కి వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం..!
- తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్
- కాంగ్రెస్ కు ఓటేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలంగాణలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు
- 4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం అన్నారు బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణలో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికాయి బీజేపీ శ్రేణులు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పాలన మొత్తం దేశం అంతా వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. తెలంగాణ లో 88 సీట్లు సాధించి మోడీ పాలన తీసుకొస్తాం అన్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసిందని మండిపడ్డారు.. రామమందిరంపై కూడా తప్పుడు మాటలు ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Odisha: స్టేజీపై నవీన్ పట్నాయక్-మోడీ సంభాషణ.. ఆసక్తిగా చూసిన నేతలు
Also Read
అయితే, ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేసామని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలిపారు బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారన్న ఆయన.. 4 స్ధానాల నుంచీ 8 స్ధానాలకు వచ్చాం.. త్వరలో 8 పక్కన 8 చేర్చి 88 చేస్తాం అన్నారు.. మా తప్పులు బేరీజు వేసుకుని సరైన పరిష్కారం దిశగా అడుగులేస్తాం అన్నారు.. మా గెలుపోటములు పై మేం సమీక్షించుకుంటాం అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కాగా, నిన్న విజయవాడ చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఈ రోజు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరైన విషయం విదితమే.. ఇక, ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఏపీ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!