Nara Bhuvaneshwari: నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య..
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణస్వీకారం
- ఓ వైపు భర్త సీఎంగా.. మరోవైపు కుమారుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆనందంలో మునిగిపోయిన నారా భువనేశ్వరి
- స్టేజిపై కూర్చున్న భువనేశ్వరిని ఆప్యాయంగా పలకరించి.. ప్రేమతో చెల్లి నుదిటిపై ముద్దు పెట్టిన బాలయ్య
- ఒక భార్యగా ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో... నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య అంటూ భువనేశ్వరి ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. ఓ వైపు భర్త సీఎంగా.. మరోవైపు కుమారుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే.. స్వయంగా వీక్షిస్తూ.. ఆనందంలో మునిగిపోయారు నారా భువనేశ్వరి.. ఇక, అక్కడ ఎంట్రీ ఇచ్చిన నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి సంతోషాన్ని రెట్టింపు చేశారు.. అయితే, ఆ క్షణాన్ని.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నారా భువనేశ్వరి..
Read Also: Sanjay Raut: అమిత్ షా మళ్లీ హోంమంత్రి కావడంతో దేశం ప్రమాదంలో పడింది..
Also Read
ప్రమాణస్వీకారం వేదికపైకి పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరూ కలిసి వచ్చారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి స్టేజిపై కూర్చున్న తర్వాత బాలకృష్ణ వచ్చి చెల్లిని ఆప్యాయంగా పలకరించి, ప్రేమతో చెల్లె నుదిటిపై ముద్దు పెట్టారు.. భువనేశ్వరి కూడా ఆప్యాయంగా అన్నయ్యకు నమస్కరించారు.. ఇక, ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ గా మారింది.. ఆ వీడియోను షేర్ చేస్తూ.. అటు నారా, ఇటు నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా ఆ వీడియోపై స్పందించారు.. ఎక్స్ (ట్విట్టర్)లో ఆ వీడియోను షేర్ చేసిన నారా భువనేశ్వరి.. ”ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో… నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు.. థాంక్స్ బాలా అన్నయ్య” అంటూ కామెంట్ చేశారు.. ఇక, ఈ వీడియోపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.. నిస్వార్థమైన ప్రేమ అని ఒకరు.. అన్నా చెల్లలి బాండ్ అని మరికొందరు.. మాకు రెండు కళ్లు సరిపోవలేదు ఈ వీడియో చూస్తుంటే అంటూ ఇంకా కొందరు.. మరుపురాని మరిచిపోలేని సన్నివేశం ఇది అంటూ.. మరో నెటిజన్ కామెంట్ చేశారు.. మొత్తంగా మరోసారి ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.
Read Also: Deputy C M: దేశంలో మొదటి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కిందో తెలుసా?
ఇక, ఈ రోజు జరిగిన ప్రమాణస్వీకారోత్సవంపై వరుసగా ట్వీట్లు చేశారు నారా భువనేశ్వరి.. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు. తెలుగు ప్రజల కోసం మీరు నిత్యం తపిస్తారు కనుకనే నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాన్ని వాళ్ళు మీకిచ్చారు. మీ పాలనలో ప్రజల ఆకాంక్షలు అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూ ఓ ట్వీట్.. మంగళగిరి ప్రజల ఆశీర్వాదంతో చారిత్రాత్మక గెలుపును సొంతం చేసుకుని, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా లోకేష్‌కు శుభాకాంక్షలు. ఒక అమ్మగా ఇది నాకు మరచిపోలేని రోజు. మున్ముందు మరిన్ని విజయాలను అందుకుని ఇటు చరిత్రలోనూ, అటు ప్రజల హృదయాల్లోనూ కలకాలం నిలిచిపోవాలని దీవిస్తున్నాను అంటూ మరో ట్వీట్.. ఏపీ సీఎంగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి.. నూతన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి.. ఆద్యంతమూ అందరికీ ఆప్యాయతను పంచి.. ఈ రాష్ట్రానికె కాకుండా మా కుటుంబానికి కూడా ఈ రోజును మరపురాని రోజుగా మిగిల్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు అంటూ ఇంకో ట్వీట్ చేశారు నారా భువనేశ్వరి.
ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో… నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేసావు. థాంక్స్ బాలా అన్నయ్య#BrotherLove pic.twitter.com/ue7QzDVhSQ
— Nara Bhuvaneswari (@ManagingTrustee) June 12, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు