-
Vijayasai Reddy: ఒక రోజు ముందుగానే సిట్ విచారణకు విజయసాయిరెడ్డి..
మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుఅవుతున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెళ్లబోతున్నారు.. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి.. తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయ సాయిరెడ్డి.. ఇక, 17వ తేదీన విచారణకు రావాలని, తాము రెడీ అని విజయసాయికి… -
CM Chandrababu: ఏపీ పరిస్థితి, అప్పులపై ఆర్థిక సంఘానికి సీఎం వివరణ.. ప్రత్యేక సాయం వచ్చేలా చూడండి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. -
AP Fibernet: ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 500 మంది ఇంటికే..!
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది.. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవ్వనున్నారు.. -
CPI Narayana: టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన సీపీఐ నారాయణ.. కీలక వ్యాఖ్యలు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. -
Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఆ పిల్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు.. -
TDP: గంటా ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియస్.. మరోసారి పునరావృతం అయితే..!
ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. "ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.." అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. విమాన సర్వీసులు జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి.. లేకపోతే విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే కదా..? కేంద్ర మంత్రి రామ్మోహన్ కి… -
Drone in Tirumala: తిరుమలలో అపచారం..! శ్రీవారి ఆలయంపై మరోసారి ఎగిరిన డ్రోన్ కెమెరా..
తిరుమలలో మరోసారి భధ్రతా వైఫల్యం భయటపడింది. రాజస్థాన్ కి చెందిన యూట్యూబర్ ఏకంగా శ్రీవారి ఆలయం పై డ్రోన్ కెమెరా ఎగురవేయడం కలకలం సృష్టించింది.. సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీవారి ఆలయం ఎదురుగా వున్న హరినామ సంకీర్తన కేంద్రం ముందు నుంచి డ్రోన్ కెమెరా ఎగురవేశాడు యూట్యూర్.. -
Nara Lokesh: ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు సన్మానం.. హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా..!!
మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో… -
Balabhadrapuram Cancer Cases: బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై మళ్లీ సమగ్ర సర్వే..
క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో మరోసారి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర సర్వే జరుపుతున్నారు. ఐదు బృందాలు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టాయి. బలభద్రపురం గ్రామంలోని పదివేల మందికి పైగా జనాభా ఉన్నారు.. ఇంటింటికి తిరిగి బృందం ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకొంటున్నారు. -
Vizag Steel Plant Workers Indefinite strike: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచి నిరవధిక బంద్..
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగింది.. రేపటి నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు.. తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లో చేర్చుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మెకు పిలుపునిచ్చారు కాంట్రాక్ట్ కార్మికులు.. మొత్తంగా రేపటి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు.. దీంతో, అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది.. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది..
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!