AP Final Voter List: ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. ఆ తుది జాబితా ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447కు పెరిగింది.. అందులో పురుష ఓటర్ల సంఖ్య 2,03,52,816గా ఉండగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,84,231గా ఉంది.. ఇక, థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 3400గా ప్రకటించింది ఈసీ.. వెలగపూడి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఈ జాబితాను విడుదల చేశారు..
Read Also: HMPV Virus: భారత్‌లో 6కి చేరిన HMPV కేసులు.. ఎక్కడంటే..
ఈ నెల 1వ తేదీని ఈ జాబితాకు సంబంధించిన అర్హత తేదీగా నిర్ణయించినట్టు ఈసీ పేర్కొంది.. గతంలో పోలిస్తే పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,165 నుండి 46,397కి పెరిగింది. ముసాయిదా ఓటర్ల జాబితాలు గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన ప్రచురించబడ్డాయి.. అయితే, అభ్యంతరాలను 28 నవంబర్ 2024 వరకు స్వీకరించామని.. అభ్యంతరాలకు పరిష్కారం చూపి, కొత్త ఓటర్లను చేర్చిన తర్వాత తుది ఓటర్ల జాబితాలు 6 జనవరి 2025న ప్రచురించినట్టు ఈసీ పేర్కొంది.. దీంతో.. గతంలో 2,02,83,021 ఉన్న పురుష ఓటర్ల సంఖ్య 2,02,88,543కి పెరగగా.. మహిళా ఓటర్ల సంఖ్య 2,10,67,377 నుంచి 2,10,81,814 చేరింది.. ఇక థర్డ్ జెండర్ ఓట్లు 3,394 నుంచి 3,400కి పెరగగా.. మొత్తం ఓటర్ల సంఖ్య 4,13,53,792 నుంచి 4,13,73,757 పెరిగినట్టు ఈసీ పేర్కొంది.. సర్వీస్‌లో ఉన్న పురుషు ఓటర్లు 64,273.. మహిళా ఓటర్లు 2,417.. ఇతర సర్వీసుల్లో ఉన్న ఓటర్లలో పురుషులు 2,03,52,816 మంది.. మహిళా ఓటర్లు 2,10,84,231.. థర్డ్ జెండర్ 3,400గా ఉండడంతో.. మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,20,935 నుంచి 4,14,40,447కి పెరిగినట్టు స్పష్టం చేసింది ఏపీ ఎన్నికల కమిషన్..